Neha Shetty: వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న రాధిక
డీజే టిల్లు(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన నేహా శెట్టి(Neha Shetty), ఆ మూవీలో రాధిక పాత్రలో ఎంతో గొప్పగా నటించి అందరినీ మెప్పించింది. తన అందం, అభినయంతో యూత్ కు ఎంతో మందికి డ్రీమ్ గాళ్ గా మారిన నేహా శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రకృతి మధ్యలో వైట్ కలర్ డిజైనర్ వేర్ లో మెరిసింది. ఈ ఫోటోల్లో నేహా పై సన్ లైట్ పడుతుండగా ఈ డ్రెస్ లో అమ్మడు మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తుందని యూత్ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






