గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండింగ్
ఛాన్స్ దొరికినప్పుడల్లా గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ లో రిలీజవుతుంది, ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అంటున్నారు తప్పించి మరో అప్డేట్ లేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మీద ఒత్తిడి పెంచేలా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండింగ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దిల్ రాజు, ఎస్వీసీ, రామ్ చరణ్, తమన్ ను ట్యాగ్ చేస్తూ డైరెక్టర్ శంకర్ ను టార్గెట్ చేసి వేల సంఖ్యల చేసిన ట్వీట్లు నిమిషాల టైమ్ లోనే వైరలవుతున్నాయి. అయితే చరణ్ ఫ్యాన్స్ మెయిన్ డిమాండ్ గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్. రిలీజ్ కు మరో నాలుగు నెలలే టైమ్ ఉండటంతో ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాకు కనీసం ఇకనైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే వినాయక చవితి సందర్భంగా డిసెంబర్ 20 రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. కానీ ఫ్యాన్స్ కు అది చాలదంటున్నారు. ఏదైనా సరే వీడియో రూపంలో కంటెంట్ కావాలని పట్టుబడుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో చాలా బిజీగా ఉన్న శంకర్ ఇప్పటికిప్పుడు టీజర్ ను రెడీ చేయలేడు. అందుకే తమన్ నేరుగా పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఈ సినిమా కోసం టీమ్ పడుతున్న కష్టాన్ని గుర్తించమని, ఎవర్నీ నొప్పించేలా సోషల్ మీడియాలో ఎలాంటి పనులు చేయొద్దని ఎక్స్ వేదికగా చరణ్ ఫ్యాన్స్ ను కోరాడు. అయినా ఫ్యాన్స్ వినేట్లు కనిపించడం లేదు. మరి ఇదెక్కడి వరకు వెళ్తుందో చూడాలి.













