అనిరుధ్ పై నెగిటివ్ కామెంట్స్
ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మరో ఆలోచన లేకుండా అనిరుధ్ పేరు చెప్పొచ్చు. వీక్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా తన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వేరే స్థాయికి తీసుకెళ్తాడని అనిరుధ్‌కి మంచి పేరుంది. జైలర్ కు అనిరుధ్ తెచ్చుకున్న పేరు అంతా ఇంతా కాదు. రజనీకాంతే స్వయంగా జైలర్ సినిమాను అనిరుధ్ తన బ్యాక్‌గ్రౌండ్‌తో బ్లాక్‌బస్టర్ రేంజ్‌కు తీసుకెళ్లాడని అభినందించాడు.
రీసెంట్ గా విజయ్ తో అనిరుధ్ చేసిన లియో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అందులో సాంగ్స్, బీజీఎం బాగా హైలైట్ అయ్యాయి. అనిరుధ్‌కు తమిళులే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నెట్టింట తనకు ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా లేవు. అయితే నిన్నటివరకు అనిరుధ్‌ను ఆకాశానికెత్తేసిన నెటిజన్లు ఇప్పుడు అనిరుధ్ పనితనం బాలేదంటున్నారు.
రీసెంట్ గా శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా వస్తున్న ఇండియన్2 టీజర్ వచ్చింది. దానికి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఏ మాత్రం బాలేదని విమర్శలొస్తున్నాయి. టీజర్ విషయంలో శంకర్ అంచనాలను అందుకోలేకపోవడం ఒకటైతే, దానికి అనిరుధ్ బీజీఎం కూడా రెండో మైనస్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇండియన్2 బీజీఎం విషయంలో అనిరుధ్ శ్రద్ధ తీసుకుంటాడో లేదో చూడాలి.













