అమెరికాలో జరగనున్న ఆరోగ్య సదస్సుకు గోదారమ్మయి
నీతూచంద్ర తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. కానీ గోదావరి ఒకటి చాలదూ. ఆమెను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచు కోవడానికి? ఆ చిత్రంలో తన సొగసులతో, నటనతో మెయిన్ హీరోయిన్ కమలినీ ముఖర్జీకి గట్టి పోటీ ఇచ్చిన నీతూచంద్ర.. తాజాగా వెల్నెస్ కాన్క్లేవ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుంది. జూన్ 8న అమెరికాలో జరగనున్న ఈ ఆరోగ్య సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనున్నారు. ఆ సదస్సు నుంచి వచ్చిన తరువాత ఈ అమ్మడు ఇంకెన్ని ఆరోగ్య చిట్కాలు చెబుతుందో వేచి చూడాల్సిందే.













