సౌత్ సినిమాలలో 200 మిలియన్ల వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టించిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్
ప్రసిద్ధ టి వి యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాటను 200 మిలియన్ల వ్యూయర్ షిప్ తో దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఏ పాట కు దక్కని సరికొత్త రికార్డు సాధించింది. ఈ సినిమాకు పాటతో వచ్చిన క్రెజ్ తో ఈ సినిమాను ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన రెండు టాప్ నిర్మాణ సంస్థలు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాయి. ఇందులో అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మార్చి నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా క్రైసిస్ లో చిక్కుకుని విడుదల ఆగిపోయింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడే రానా దగ్గుబాటి నుంచి సపోర్ట్ లభించింది. ఆయనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు. మున్నా దర్శకత్వం వహించారు. ప్రదీప్‌కు ఉన్న క్రేజ్‌తో సినిమాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేకుండా ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాట రికార్డు ఉపయోగపడింది.













