పాన్ ఇండియా లెవెల్లో NBK109?
భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ తన తర్వాతి సినిమాను బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ను ఎంపిక చేస్తున్నాడు బాబీ.
ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేయగా, తాజాగా మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ ను కూడా ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. మరో కీలక పాత్ర కోసం గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను కూడా తీసుకున్నారని టాక్.
అంతేకాదు, బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ ను కూడా బాలీవుడ్ నుంచి తీసుకురావాలని బాబీ ట్రై చేస్తున్నాడట. ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే ఈ సినిమా కచ్ఛితంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుందని అర్థమవుతుంది. మరి బాలయ్యతో జత కట్టబోయే ఆ బాలీవుడ్ భామ ఎవరో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.













