నయన్‌తో మైత్రీ భారీ మూవీ
చాలా కాలంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రాణించాలని చూస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కు ఇప్పటివరకు సోలో గా సరైన హిట్ పడలేదు. ఆమె చేసిన సినిమాలన్నీ మిక్డ్ రిజల్ట్స్ తో బయటపడుతున్నాయి కానీ అరుంధతి రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. తన సొంత బ్యానర్ లోనే కాకుండా ఇతర బ్యానర్లలో కూడా సోలోగా సినిమాలు చేస్తున్నప్పటికీ అవన్నీ నయన్‌కు నిరాశనే మిగులుస్తుంది.
అయితే ఇప్పటివరకు నయనతార నటించిన ఏ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కాదు. లిమిటెడ్ బడ్జెట్ లోనే అన్నీ తెరకెక్కాయి. ఫ్లాప్ అయినా పెద్దగా నష్టాలు కూడా వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అమ్మడుతో ఓ భారీ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఆ సినిమా కోసం మైత్రీ సంస్థ సుమారు రూ. 70 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తుందట. ఈ 70 కోట్లు కేవలం సినిమా బడ్జెట్ కోసమేనట. ఇది కాకుండా నయనతార రెమ్యూనరేషన్ సపరేట్. ఈ సినిమాకు కథ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదు. నయన్ క్రేజ్ చూసి మైత్రీ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి నయన్ ను ఏ డైరెక్టర్ మెప్పిస్తాడో, ఎలాంటి కథతో మైత్రీ నిర్మాతలు నయన్ ను సంప్రదిస్తారో చూడాలి.













