అక్క పాత్రలో నయన్
సౌత్ లో లేడీ సూపర్‌స్టార్ గా పిలుచుకునే నయనతార 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్ గడిచినా కూడా తన డిమాండ్ ను మాత్రం అలాగే మెయిన్‌టెయిన్ చేస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఒకప్పటిలా తెలుగులో ఫాలోయింగ్ లేకపోయినా, మంచి హిట్ పడితే మళ్లీ కంబ్యాక్ అవడం పెద్ద పనేమీ కాదు. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్ర లేదంటే, ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన నయన్ ఇప్పుడు ఓ సినిమాలో కీలక పాత్ర లో నటిస్తోంది.
తాజాగా తన భర్త కం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కోసం నయన్ ఓ మెట్టు దిగి అక్క పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. లవ్ టుడే అంటూ తక్కువ బడ్జెట్లో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ కం హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో అక్క పాత్రలో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ కోసం నయన్ కు లాక్ చేశాడని తెలుస్తోంది.
పేరుకు అక్క పాత్రే కానీ కథలో ఎంతో ప్రాధాన్యముంటుందని సమాచారం. ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నిప్పు లేనిదే పొగ రాదు అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. దానికి తోడు విఘ్నేష్ మూవీ కావడంతో నయన్ నో చెప్పే ఛాన్స్ లేదు. చాలా కాలంగా భారీ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న విఘ్నేష్ కు ఈ మూవీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













