రజనీతో నయన తీన్మార్
రజనీకాంత్, నయనతార ముచ్చటగా మూడోసారి జోడీ కట్టబోతున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా సిరుత్తై శివ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా తెరకెక్కుతున్నది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చంద్రముఖి, దర్బార్ తర్వాత రజనీ నయనతార కలయికలలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది.













