‘సైరా’ షూటింగ్ లో నయనతార
మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం సైరా నరసింహరెడ్డి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ సంస్థపై నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో కొనసాగుతున్నది, ఈ రోజు నయనతార టీంతో కలిసిందట. ప్రస్తుతం చిరంజీవి, నయనతార, జగపతిబాబు కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో అమితాబ్ జాయిన్ కానున్నారు.













