సూపర్‌స్టార్ టైటిల్‌తో లేడీ సూపర్‌స్టార్
స్క్రిప్ట్‌కి సరిపడినప్పుడు పాత సినిమా టైటిల్స్‌ని మళ్లీ వాడుతుంతారు. 1981లో రజనీకాంత్ నటంచిన వెట్రికన్ టైటిల్‌ను ఇప్పుడు నయనతార సినిమాకు పెట్టారు. సూపర్‌స్టార్ టైటిల్‌ను ఏ సినిమాకైనా వాడేస్తే అభిమానుల్లో చిన్న నిరుత్సాహం ఉంటుంది. కానీ, రజనీ సూపర్‌స్టార్, నయనతార లేడీ సూపర్ స్టార్.. సొ నో ప్రాబ్లమ్ అనుకుంటున్నారు రజనీ ఫ్యాన్స్. అవల్ (తెలుగులో గృహం) తెరకెక్కించిన మిలింద్ రావ్ దర్శకత్వంలో నయనతార ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా వెట్రికన్ (మూడో కన్ను అని అర్థం). నయనతార భాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ బ్రెయిలీ లిపీలో రాసి ఉండటంతో సినిమాలో నయనతార అంధురాలిగా నటించనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.













