జయలలిత పాత్రలో అందాల తార?
తమిళనాడు మాజీ సీఎం, ఐరన్ లేడీ జయలలిత బయోపిక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే జయలలిత కోసం రెండు సినిమాలు రంగంలో ఉండగా, తాజాగా మరో బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళుల అమ్మ జయలలిత పాత్రలో నటించేది ఎవరో కాదు, సంచలన నయనతార? నయనతార జయలలిత పాత్ర చేస్తుందటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అచ్చంగా అలాంటి సంఘటన జరుగుతుంది. ఈ సమాచారం బయటకు పొక్కగానే ప్రాజెక్టుపై కోలీవుడ్లో చర్చ మొదలైంది. ఇటీవలే నయనతార లింగుస్వామి మధ్య చర్చలు జరిగాయని కూడా అంటున్నారు. ఆమె కూడా ఓకె అనేలా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.













