హీరోయిన్ గా ఆమె వయసు 15 ఏళ్లు
నయనతార వయసు మూడు పదులు పైనే అయ్యుండవచ్చు. కానీ హీరోయిన్గా ఆమె వయసు మాత్రం పదిహేనేళ్లు. 2003లో ఓ మలయాళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నయన, 2006లో విడుదలైన చంద్రముఖితో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతూనే ఉంది. ఇటీవలకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి సూపర్‌హిట్స్ అందుకున్న నయనతార లేడీ సూపర్‌స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకుంది. నయన నటించిన ఓ మలయాళ చిత్రం లేడీ టైగర్ పేరుతో ఈ నెల 28న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది.













