బ్రేకప్ వార్తలకు నయన బ్రేక్
నయనతార, విఘ్నేష్ ప్రేమ విఫలమైందని, బ్రేకప్ చెప్పేసుకున్నారని కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. వీరిద్దురు చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పెళ్లి వార్తను త్వరలో చెబుతారని భావిస్తున్న తరుణంలో బ్రేకప్ వార్త హల్ చల్ చేస్తోంది. విడిపోయారని జరుగుతున్న ప్రచారానికి నయనతార పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తను విఘ్నేష్‌తో సంతోసంగా ఉన్నట్టు తెలిపింది. విఘ్నేష్ సైతం దీనిపై స్పందిస్తూ నయనతో తను దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టారు. నయన, విఘ్నేష్ ఇద్దరూ దీనిపై సృష్టత ఇవ్వడంతో బ్రేకప్ వార్తలకు బ్రేక్ పడినట్టుగానే భావించాలి.













