జూన్ 8 తర్వాత నయనతార పెళ్లి?
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గత కొంతకాలంగా ప్రేమబంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర కొత్త మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా స్థలాలకు అనుమతి లభించింది. దీంతో జూన్ 8 తర్వాత తమిళనాడులోని ఓ ఆలయంలో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు, దానికి ఓ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో వారి అభిమానులు ఇప్పటి నుంచే వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఆ జంట ఖండించలేదు. అదే సమయంలో వారు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు.
2015లో విడుదలైన `నానుమ్ రౌడీ ధాన్` చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరో. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది నయనతార. అప్పటి నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు తమ సెల్ఫీలను, ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంది నయన. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముంది? నిజంగానే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













