నాగ్-నయన జోడీ?
బాస్, గ్రీకువీరుడు నాగార్జున నయనతార కలసి నటించిన చిత్రాలివి. వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలసి నటించబోతున్నట్టు సమాచారం. నాగార్జున కథానాయకుడిగా నటించిన సోగ్గాడే చిన్ని నాయిన మంచి విజయం అందుకుంది. కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. దానికి సీక్వెల్‌గా బంగార్రాజు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇందులో కథానాయికగా నయనతార పేరు పరిశీలిస్తున్నారు. చిరంజీవి సైరాలో నయన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చేతిలో మరో తెలుగు సినిమా చేరినట్టే. అన్నీ కుదిరితే నాగ్-నయన జోడీ హ్యాట్రిక్ కొట్డం ఖాయం. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2తో బిజీగా ఉన్నారు. ఆ వెంటనే బంగార్రాజు సెట్స్‌పైకి వెళ్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారు.













