లేడీ సూపర్ స్టార్ కు… చెర్రీ రిక్వెస్ట్!
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుందని ఫిల్మ్ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్. ముఖ్యంగా తెలుగుసినిమాల ప్రమోషన్స్‌ను అస్సలు పట్టించుకోదట ఆమె..తాజాగా నయన్ చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇటీవల నయన్‌కు రిక్వెస్ట్ చేశారట. సైరా ప్రమోషన్లలో పాల్గొనాలని నయన్‌ను అడిగారని తెలిసింది. అందుకు మొదట ఆమె ఒప్పుకోలేదట. కానీ చరణ్ రిక్వెస్ట్ చేసే సరికి సానుకూలంగా స్పందించిందని సమాచారం.













