నయన్ స్పీడ్ తగ్గట్లేదుగా!
మొన్నటివరకు సౌత్ లోనే సినిమాలు చేసిన నయనతార, జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. లేడీ సూపర్ స్టార్ గా తన ట్యాగ్ లైన్ కు తగ్గ సినిమాలు చేస్తూ అదరగొడుతున్న నయనతార, బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమానే హిట్ అవడంతో అక్కడి నుంచి క్రేజీ క్రేజీ ఆఫర్లొస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లొస్తున్నప్పటికీ నయన్ మాత్రం కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోందని తెలుస్తోంది.
సౌత్ హీరోయిన్స్ లో రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా నయనతారకు పేరుంది. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నయన్, ప్రస్తుతం తన 75వ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మాధవన్, సిద్దార్థ్ నటిస్తున్నారు. ఈ మూవీతో పాటూగా అన్నపూరణి అనే మరో మూవీకి కూడా నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా అరుణ్ రాజా కామరాజ్ డైరెక్షన్లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కూడా నయన్ సైన్ చేసిందని తెలుస్తోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా నయనతార భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఏదేమైనా పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్నప్పటికీ సినిమాల విషయంలో నయన్ స్పీడ్ మాత్రం తగ్గట్లేదు.













