అలా బతకడమెందుకు?
మనం సమాజంలోనే ఉంటున్నాం. ఇరుగు పొరుగును పట్టించుకుంటూ ముందుకు వెళ్లాలి. అదే సమయంలో జీవితమంటే మన గురించి మాట్లాడే ఆ నలుగురు మాత్రమే కాదన్న విషయాన్ని గ్రహించాలి అని అంటున్నారు నయనతార. జీవితాన్ని తను చూసే కోణం గురించి ఆమె మాట్లాడుతూ మనలో ప్రతి ఒక్కరికీ జీవితం మీద ఓ అవగాహన ఉంటుంది. భవిష్యత్తులో ఏం కాదలచుకుంటున్నామనే విషయం పట్ల ఓ సృష్టత ఉంటుంది. అలా ఉండటం తప్పు కాదు. నాక్కూడా వ్యూచర్ పరంగా మంచి ఆలోచనలున్నాయి. వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాను. నా ప్రయాణాన్ని ఎవరైనా తప్పు పడితే నేను పట్టించుకోను. నిత్యం అది అలాగట..ఇది ఇలాగట అని మాట్లాడేవారి గురించి ఆలోచిస్తూ, కూర్చుంటే సరిపోతుందా? విలువైన సమయాన్ని వృథా ఆలోచనలకు పరిమితం చేస్తే నా భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా? అందుకే నేను ఇతరుల కోసం బతకడం మానేశాను అని అన్నారు.













