Toxic: నయన్‌తో టాక్సిక్ క్రేజ్ పెరగడం ఖాయం
కెజిఎఫ్(KGF) సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించిన యశ్(Yash) తన తర్వాతి సినిమాను గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. టాక్సిక్(Toxic) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందుగా ఓ కీలక పాత్ర కోసం కరీనా కపూర్(Kareena Kapoor) ను తీసుకోవాలనుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ వల్ల ఆమె ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయింది.
ఇప్పుడు ఆ ప్లేస్ లోకి నయనతార(Nayanthara) వచ్చి చేరింది. టాక్సిక్ లో నయన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్. ఆ మధ్య జవాన్(Jawaan) సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన నయనతార ఇప్పుడు టాక్సిక్ లో యశ్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమాలో నయన్ జాయిన్ అవడం వల్ల టాక్సిక్ కు మరింత క్రేజ్ రాబోతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఇదిలా ఉంటే టాక్సిక్ లో యశ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కు కొత్త అనుభూతిని కలిగిస్తాయని చెప్తున్నారు. యశ్ కు జోడీగా కియారా అద్వానీ(kiara Advani) నటిస్తున్న ఈ సినిమాలో నయనతార యశ్ కు సోదరి పాత్రలో కనిపిస్తుందని శాండిల్ వుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టాక్సిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.













