Raja Saab: రాజా సాబ్.. అది పుకారే
ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో వస్తున్న హార్రర్ థ్రిల్లర్ రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా మీద రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమా మొదలై చాలా కాలమవుతున్నా ఇప్పటివరకు ఒక్క మోషన్ పోస్టర్ తప్ప మరే కంటెంట్ రాలేదు. అయితే ఈ సినిమాలో నయనతార(Nayanthara) స్పెషల్ సాంగ్ చేస్తుందని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి.
నయన్ చేసే ఈ స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు నయన్ స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పదు. ఎంత ప్రభాస్ తో నయన్ గతంలో ఓ సినిమా చేసినా కూడా ఆమె ఇప్పుడ సాంగ్ చేయడానికి ఏ మాత్రం ఒప్పుకోదు. దానికి తోడు ప్రస్తుతం నయన్ తెలుగు సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అంతేకాదు నయన్ స్పెషల్ సాంగ్ చేసినా తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్తుంది తప్పించి ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొను. మరి అలాంటి నయన్ కు కోట్లు కుమ్మరించి సాంగ్ చేయించుకోవడం కన్నా వేరే హీరోయిన్ ని తీసుకోవడం బెటరని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ ను ఎవరు చేసినా సరే అది నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.













