నవీన్ సినిమాకు డైరెక్టర్ ఛేంజ్
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు తర్వాత మరో సినిమా చేయడానికి చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ఇకపై ఇంత గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని డిసైడ్ అయిన నవీన్, తన రాబోయే సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్కు ముందే అనగనగా ఒక రాజు సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా టైటిల్, టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. కొంతవరకు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ సినిమా అవుట్పుట్ విషయంలో నవీన్ సంతృప్తిగా లేకపోవడంతో అనగనగా ఒక రాజుకు డైరెక్టర్ మారాడని తెలుస్తోంది. ముందు ఈ మూవీకి డైరెక్టర్ గా అనుకుంది కళ్యాణ్ శంకర్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు అతను దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది.
గతంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఈ డైరెక్టర్ మ్యాడ్ అనే సినిమాను తీశాడు. కానీ ఆ మూవీ ఆగిపోవడంతో ప్రొడ్యూసర్ నాగవంశీ, కళ్యాణ్ కు ఈ సినిమా అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీ నుంచి కళ్యాణ్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై మేకర్స్ మాత్రం ఎలాంటి చప్పుడూ చేయట్లేదు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ ను మరో డైరెక్టర్ చేతిలో పెట్టాలని నవీన్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎవరి చేతిలో పడుతుందో చూడాలి.













