నవీన్ పోలిశెట్టికి మూడు బ్రేకప్స్..
మొదటి సినిమాతో నవీన్ పోలిశెట్టికి ట్యాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు దక్కింది. అతని సినిమాలు, తన పాత్రల ఎంపిక అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. త్వరలో జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణ లో ఈ సినిమా తీసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సినిమాను మార్చి 11 న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతి రత్నాలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే నవీన్ క్యాష్ మరియు సరిగమప షో లకు అటెండ్ అయ్యాడు. నువ్వే నువ్వే ఆల్బం పాట ఎపిసోడ్ చూస్తున్న సమయంలో నా మూడు బ్రేకప్ లు గుర్తొచ్చాయని నవీన్ సరిగమప షో లో చెప్పగానే మరి మిగిలిన మూడు అని ప్రదీప్ అడగ్గానే అవి వేరే పాట కోటి గారి పాట కాదు అంటూ నవీన్ ఠక్కున ఆన్సర్ ఇచ్చేశాడు. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో నవీన్ బ్రేకప్స్ గురించి బయటపడ్డాయన్నమాట.













