ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆ యంగ్ హీరో..
అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందనే విషయాన్ని ఎప్పుడో అధికారికంగా ప్రకటించేశారు కూడా. ఎన్టీఆర్30 గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే టైమ్ దగ్గరపడింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. మామూలుగా అయితే గతేడాది సమ్మర్ లోనే సినిమా మొదలు కావాల్సింది. కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ ఛేంజ్ అయిపోయాయి.
ఏప్రిల్ నుంచి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు సినిమాలోని నటీనటుల ఎంపిక, లొకేషన్స్ ఇతర విషయాలను సెట్ చేసే పనిలో పడిందట చిత్ర యూనిట్. ట్రస్టెడ్ సోర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని అడుగుతున్నట్లు తెలుస్తుంది.
నవీన్ అయితే ఎన్టీఆర్ తో పోటీ పడి నటించగలడని తనని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. నవీన్ ఇప్పటికే ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో నటుడిగా మంచి మార్కులు దక్కించుకుని ఇప్పుడు జాతి రత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈ అవకాశాన్ని నవీన్ మిస్ చేసుకోదలచుకోవట్లేదట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.













