Anaganaga Oka Raju: కామెడీతో హైప్ పెంచేసిన నవీన్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr. Polishetty) హిట్ తర్వాత నవీన్(Naveen) నుంచి ఇప్పటివరకు మరో సినిమా వచ్చింది లేదు. తనకు యాక్సిడెంట్ అవడంతో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆడియన్స్ ను అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) నిర్మిస్తున్న అనగనగా ఒక రోజు(Anaganaga Oka Raju) సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా నవీన్ బర్త్ డే సందర్భంగా రిలీజైంది.
అంచనాలకు తగ్గట్టే టీజర్ నవీన్ మార్క్ కామెడీతో ఉంది. రాజు గారి పెళ్లిలో కాజు కట్లీ కూడా గోల్డ్ రేకుతో ఉండాలని, ముకేష్ అంబానీకి ఫోన్ చేసి అనంత్ పెళ్లికొచ్చిన సెలబ్రెటీల ఫోన్ నెంబర్లు అడిగి వాళ్లను తన సంగీత్ కోసం తీసుకురమ్మని చెప్పడం, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నవీన్, మీనాక్షి(Meenakshi) పోజులివ్వడానికి తంటాలు పడటమంతా చాలా ఫన్నీగా ఉంది.
కథ గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు కానీ బాగా డబ్బున్న రాజు బిల్డప్ తో మిడిసిపడే జీవితం అనైతే క్లూ ఇచ్చారు. సినిమా ఫలానా తేదీన రిలీజవుతుందని చెప్పలేదు కానీ 2025లో రిలీజవుతుందనే హింట్ అయితే ఇచ్చారు. మొత్తానికి టీజర్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచడంలో నవీన్ పోలిశెట్టి సక్సెస్ అయ్యాడు.













