Naveen Polishetty: మణిరత్నంతో నవీన్ రిస్క్ చేస్తాడా?
టాలీవుడ్ యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)కి ఎన్ని ఆఫర్లొస్తున్నా తాను మాత్రం ఎంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. 2019 నుంచి ఇప్పటివరకు నవీన్ నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. అయితే ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లే. ప్రస్తుతం నవీన్ చేతిలో అనగనగా ఒక రాజు(Anagana Oka raju) సినిమా మాత్రమే ఉంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) నవీన్ కు ఓ స్టోరీ లైన్ చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగానే టాక్ వినిపిస్తుంది. పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan), థగ్ లైఫ్(Thug Life) సినిమాల తర్వాత మణిరత్నం ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తక్కువ బడ్జెట్ లో చేయాలనుకుంటున్నాడట. ముందు ఈ లవ్ స్టోరీని కొత్త నటీనటులతో తీస్తారని టాక్ వచ్చింది.
కానీ ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ అయితేనే బెటరని నవీన్ ను అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ మణిరత్నంతో సినిమా ఒప్పుకునే రిస్క్ ఇప్పుడు నవీన్ చేస్తాడా అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే మణిరత్నం ఒకప్పటిలా ఫామ్ లో లేరు. టాలీవుడ్ హీరోలతో ఆయన చేసిన సినిమా ఒకటి మాత్రమే. అది కూడా మూడు దశాబ్దాలు దాటింది. మరి వీటన్నింటినీ ఆలోచించుకుని నవీన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.













