బాలీవుడ్ రామాయణంలో నవీన్ పోలిశెట్టి
నితీష్ తివారీ దర్శకుడిగా రామాయణంను మూడు భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను మార్చి నాటికి సెట్స్ పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటీనటుల సెలెక్షన్స్ పూర్తవుతున్నాయి. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అమితాబ్ బచ్చన్ నటించాడనికి ఓకే అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, లారా దత్తా కైకేయిగా నటించడానికి ఎంపికయ్యారని అంటున్నారు. ఇప్పుడు యువ రాముడు- లక్ష్మణుడు పాత్రల కోసం చిత్ర బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణుడిగా టాలీవుడ్ యంగ్ నటుడు నవీన్ పోలిశెట్టిని సంప్రదించారని సమాచారం. ఇదే నిజమైతే నవీన్‌కు ఇది చాలా మంచి అవకాశం.
పాన్ ఇండియాలో అతడికి ఈ సినిమాతో మంచి క్రేజ్ వస్తుంది. ఇదిలా ఉంటే రామాయణం షూటింగ్ ఈ మార్చిలో మొదలవుతుంది. వచ్చే సంవత్సరం దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొన్ని నెలల కిందటే రణబీర్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లి వీఎఫ్ఎక్స్ కంపెనీతో రామాయణం ప్రీ విజువలైజేషన్ ను పరిశీలించి వచ్చినట్లు సమాచారం.













