డైరెక్టర్‌ను తప్పించేసిన నిర్మాత. కారణమేంటి?
కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియన్ సినిమా డెవిల్. సుభాష్ చంద్రబోస్ స్టోరీతో సీక్రెట్ ఏజెంట్ క్యాప్షన్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా కథను అందించగా డైరెక్టర్ బాధ్యతలు నవీన్ మేడారం చూసుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ బాధ్యతల నుంచి నవీన్ తప్పుకున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ కూడా అఫీషియల్ పోస్టర్‌ను అనౌన్స్ చేశారు. నవీన్ ప్లేస్‌లోకి ప్రొడ్యూసర్ అయిన అభిషేక్ నామ చేరాడు. అంటే ప్రస్తుతం దర్శకత్వం మరియు నిర్మాణ పనులను మొత్తాన్ని అభిషేకే చూసుకుంటున్నాడన్నమాట. వాస్తవానికి నవీన్ కు విజువల్ ఎఫెక్ట్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అవతార్ లాంటి హాలీవుడ్ సినిమాలకు కూడా నవీన్ ఆ విభాగంలో పనిచేశాడు. ఈ కథకు నవీన్ అయితేనే కరెక్ట్ అని డెవిల్ సినిమాను మొదట అతని చేతిలోనే పెట్టారు. షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా అయింది. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నవీన్ నిలబెట్టుకుని బెస్ట్ అవుట్‌పుట్ కూడా ఇచ్చాడని, ఈ సినిమా తర్వాత నవీన్ కెరీర్ తర్వాతి స్థాయికి వెళ్తుందని చాలా మంచి టాక్ కూడా బయటకు వచ్చింది.
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఉన్నట్లుటుండి నవీన్ ను ఈ సినిమా నుంచి తప్పించి, ఆ ప్లేస్‌లోకి అభిషేక్ చేరాడు. అందుకే కనీసం పోస్టర్స్ లో కూడా నవీన్ పేరును వేయకుండా వదిలేశారు. అయినా షూటింగ్ మొత్తం అయ్యాక ఇప్పుడు డైరెక్టర్‌గా ఎవరి పేరు వేసుకుంటే ఏముందిలే అనుకుంటున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంపై రిలీజ్ టైమ్ లో అభిషేక్ ఎలాంటి సమాధానాలిస్తారో చూడాలి.













