Jathiratnalu: జాతిరత్నాలు మొదటి హీరో నవీన్ కాదట!

ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు ఇంకొకరు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఆ విషయాలు కొన్ని సార్లు వెంటనే బయటపడితే మరికొన్ని సార్లు చాలా రోజులకు కానీ బయటకు రావు. ఇప్పుడలానే ఓ సినిమా గురించి ఎవరికీ తెలియని విషయం బయటికొచ్చింది. టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరో ఓ బ్లాక్ బస్టర్ మూవీని వదులుకున్నారట.
అతను మరెవరో కాదు తేజా సజ్జ(teja sajja). హను మాన్(hanu man) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ ప్రస్తుతం మిరాయ్(mirai) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కానుండగా ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్స్ లో తేజ బిజీగా ఉంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
అందులో భాగంగానే తానొక బ్లాక్ బస్టర్ మూవీని వదులుకున్నట్టు చెప్పారు తేజ. ఆ సినిమానే జాతిరత్నాలు(jathiratnalu). అనుదీప్(anudeep) దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి(naveen హీరోగా వచ్చిన జాతిరత్నాలు సినిమా కథ ముందు తేజ వద్దకే వెళ్లిందట. కానీ కొన్ని కారణాల వల్ల తేజ ఆ ప్రాజెక్టు చేయకపోవడంతో అది నవీన్ వద్దకు వెళ్ళిందని, ఆ సినిమా నవీన్ వద్దకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని, నవీన్ ఆ పాత్రకు 100% న్యాయం చేశాడని తేజా సజ్జా చెప్పారు.