నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం
హీరోగా తనదైన ముద్రను వేసిన నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందబోతున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గౌరవ దర్శకత్వం దర్శకుడు అనీల్ కృష్ణ వహించారు. వెంకటాపురం ఫేమ్ వేణు మధుకంటి దర్శకత్వంలో యశాస్ సినిమా పతాకంపై మంజునాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ యశాస్ సినిమాస్ బ్యానర్లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథపై వర్క్ చేసాం. తప్పకుండా ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ నా కెరియర్లో బాల్ రెడ్డి పాత్ర పెద్ద మలుపుగా అనుకోవచ్చు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నాం. కథను నమ్మే ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం అన్నారు.













