వరుస సినిమాలతో నాని బిజీ
టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నాని ఒకడు. హిట్టూ ఫ్లాపు గురించి పట్టించుకోకుండా వీలైనన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంటాడు నాని. ప్రస్తుతం నాని నటించిన హాయ్ నాన్న సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. డిసెంబర్ 7న హాయ్ నాన్న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు.
ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హాయ్ నాన్న పై ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి అంచనాలున్నాయి. హాయ్ నాన్న పూర్తైన వెంటనే నాని వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమాకు సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇప్పుడు హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చాడు కానీ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆ తర్వాత తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సినిమాను స్టార్ట్ చేసే ఛాన్సుంది. ఆ తర్వాత శైలేష్ కొలనుతో హిట్3 చేయనున్నాడు. ఇప్పటికే సినిమా లైన్ లాక్ అయిందని, ఫైనల్ స్క్రిప్ట్ మాత్రమే రెడీ కావాల్సి ఉందని తెలుస్తోంది.
వీటితో పాటూ దసరాతో నానికి మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు కూడా నాని మరో అవకాశమివ్వబోతున్నట్లు రీసెంట్గా శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాడు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తోంది. హాయ్ నాన్న సినిమాకు వచ్చే రిజల్ట్ ను బట్టి నాని, ఎమోషనల్ కథలు ఒప్పుకోవాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నాడట. మొత్తానికి వరుస సినిమాలతో నాని బిజీగా ఉన్నాడన్నమాట.













