ఆ సినిమాను పక్కనపెట్టిన నాని
దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాని తన తర్వాతి సినిమాగా హాయ్ నాన్న అనే సినిమాను తీస్తున్నాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా సినిమాతో తన రూట్ మార్చాడనుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న సినిమా చేస్తూ మళ్లీ తన రొటీన్ ఫార్మాట్ లోకి వచ్చేశాడు.
ఈ సినిమా తర్వాత నాని, వివేక ఆత్రేయ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో అంటే సుందరానికీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో వివేక్ పై నమ్మకంతో నాని మరో ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో నాని హీరోగా రావాల్సిన హిట్3 ఎప్పుడొస్తుందంటూ నాని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం నాని హిట్3 సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టాడని తెలుస్తోంది. తన బ్యానర్లో హిట్1, హిట్2 సినిమాలను నిర్మించిన నాని, హిట్ థర్డ్ కేస్లో నానినే నటించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు కానీ ఇప్పుడు సొంత బ్యానరే కదా ఎప్పుడైనా హిట్3 చేసుకోవచ్చులే అనే ఆలోచనలో నాని ఉన్నాడని తెలుస్తోంది. అదే నిజమై గ్యాప్ వస్తే మాత్రం హిట్3ని నాని క్యాష్ చేసుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఇస్తే క్రేజ్ తగ్గిపోతుంది. ఈ మేరకు నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.













