ఫలితాల తర్వాతే జాతీయ పురస్కారాలు
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ ఏడాది జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన ఆలస్యం కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే జాతీయ పురస్కారాలను ప్రకటించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సినీ ప్రముఖులతో ఏర్పాటయ్యే నిష్పాక్షిక జ్వూరీ ఏటా ఈ నెల్లోనే పురస్కారాల్ని ప్రకటిస్తుంటుంది. కానీ ఈ సారి లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఆ ప్రక్రియ ముగిశాకా పురస్కారాల్ని ప్రకటిస్తామని ఆ శాఖ వెల్లడించింది.













