‘నటన’ ఆడియో విడుదల
లోకంలో ఒకరిని మించిన మహానటులు మరొకరు ఉంటారనే కథాంశంతో రూపొందిన సినిమా నటన. భారతీబాబు పెనుపాత్రుని దర్శకుడు. కుబేర ప్రసాద్ నిర్మాత. మహీదర్, శ్రావ్యారావు హీరో హీరోయిన్లు. ఎం.ఎం. శ్రీలేఖ ఓ పాటను, ప్రభు ప్రవీణ్ మిగతా పాటలను, నేపథ్య సంగీతాన్ని అందించారు. హైదరాబాద్లో శివాజీరాజా, భానుచందర్ ఆడియో సీడీలను విడుదల చేశారు. నటనతో ఎదుటివ్యక్తిని మోసం చేయాలని మనం ప్రయత్నిస్తే, అవతలి వ్యక్తి మన కంటే మహానటుడు అయితే మనమే మోసపోతామనేది చిత్రకథ. భానుచందర్గారు ప్రధాన పాత్ర చేశారు అన్నారు భారతీబాబు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు నిర్మాత కుబేర ప్రసాద్.













