అంగరంగ వైభవంగా నాటకం సక్సెస్ మీట్
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా విలేజ్ బ్యాక డ్రాప్‌తో వస్తున్న చిత్రం నాటకం. కల్యాణ్ జి. గోగన దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ అందించారు. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాపతంగా ఎంతో ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్‌ను అంగరంగవైభవగా నిర్వహించారు. నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ నమ్మి సినిమాను కొన్నందుకు అది మీరు ఇంత పెద్దహిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. మా బ్యానర్లో ఫస్ట్ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ అవ్వటం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తానని తెలిపారు. హీరో అశిష్‌గాంధీ మాట్లాడుతూ అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని అంటున్నారని తెలిపారు. యుకె నుంచి కూడా మంచి టాక్ వస్తుందన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు సాయికార్తీక్ తదితరులు మాట్లాడారు.













