నాటకం ప్రీరిలీజ్ వేడుక
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఆశీష్గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నాటకం. శ్రీసాయి దీప చాట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్‌గాంధీ, ఉమకూచిపూడి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుక, ఆడియో సిడిలను సుధీర్‌బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైలర్ విడుదల తర్వాత సినిమాకు మంచి హైప్ వచ్చిందన్నారు. ఇపుడు మంచి చాయిస్ కచ్చితంగా ఓపెనింగ్స్ వస్తాయన్నారు. ఈ చిత్రంలో ఆశిష్‌గాంధీ చాలా బాగున్నాడని అన్నారు. చాలా చక్కగా నటించాడని ప్రశంసించారు. టీంకు అభినందనుల అని తెలిపారు. సాయికార్తీక్, కెమెరామెన్ అంజి, కళ్యాణ్ జి.గోగణ, ఆశీష్గాంధీ తదితరులు మాట్లాడారు.













