ప్రతినిధికి సీక్వెల్ చేస్తున్న నారా రోహిత్
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కొడుకుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నారా రోహిత్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ వచ్చాడు. రోహిత్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనుకున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి టైమ్ లో నారా రోహిత్ సెలెక్ట్ చేసుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా వర్కవుట్ అవలేదు.
వరుసగా రెండు మూడు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నారా రోహిత్ కెరీర్ గాడి తప్పింది. సినిమాలు లేక ఇండస్ట్రీకి దూరమైన నారా రోహిత్ ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్తున్నాడంటూ ప్రచారాలు కూడా జరిగాయి. కానీ అవన్నీ వార్తలు గానే మిగిలిపోయాయి తప్పించి ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లింది లేదు. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓ మంచి మూవీ రాబోతుందని వార్తలొస్తున్నాయి.
నారా రోహిత్ కెరీర్లో స్పెషల్ మూవీ అయిన ప్రతినిధి సినిమాకు సీక్వెన్స్ గా ఓ సినిమా రాబోతుందనేది తాజా సమాచారం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ఎలాగైనా ఈ మూవీతో తను టాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవాలని గట్టిగా ట్రై చేస్తున్నట్లు రోహిత్ సన్నిహితులు చెప్తున్నారు. ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రానుంది.













