ఎన్టీఆర్ గా చంద్రబాబు మనుమడు
ఇటీవలే షూటింగ్ పార్ట్‌ని పూర్తిచేసుకున్న మహానాయకుడుకు సంబంధిచిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించినట్లు తెలిసింది. గత వారమే దేవాన్ష్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేశారట. ప్రస్తుతం మహానాయకుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్బికె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.













