Balakrishna: బాలయ్యకు భారీ పార్టీ ఇవ్వనున్న భువనేశ్వరి
సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ(balakrishna)కు రీసెంట్ గా పద్మభూషణ్ పురస్కరాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలయ్యకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం పట్ల పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. అయితే బాలయ్య ఈ ఘనత సాధించినందుకు రేపు హైదరాబాద్ నగర శివార్లలో భారీ పార్టీ జరగనున్నట్టు సమాచారం.
ఆ పార్టీ ఇస్తున్నది మరెవరో కాదు, బాలయ్య సొంత చెల్లెలు, ఏపీ సీఎం భార్య నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari). సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) భార్య నారా భువనేశ్వరి. హైదరాబాద్ శివార్లలోని చంద్రబాబు ఫామ్ హౌస్ లో నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్ల మధ్య ఈ పార్టీ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి ఇరు కుటుంబాలకు సన్నిహితులైన వారు కూడా హాజరుకానున్నట్టు సమాచారం.
వారితో పాటూ బాలయ్యతో సినిమాలు చేసిన దర్శకనిర్మాతలకు కూడా ఈ పార్టీకి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చాక ఆయనకు జరుగుతున్న మొదటి సన్మానం ఇదే. ఈ సన్మానం కాకుండా టాలీవుడ్ నుంచి కూడా బాలయ్యకు గ్రాండ్ గా సన్మాన సభను ఏర్పాటు చేయాలని సినీ పరిశ్రమ పెద్దలు ఆలోచిస్తున్నారు.













