Nandamuri Thaman: భువనేశ్వరి నోట నందమూరి తమన్ మాట
అఖండ(Akhanda)తో మొదలుపెట్టి వీర సింహారెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari), డాకు మహారాజ్(Daaku Maharaj) సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన సంగీతం మామూలుది కాదు. బాలయ్య(Balayya) అంటే తమన్(Thaman) కు పూనకాలొచ్చేస్తాయని అందరూ అంటుంటారు. బాలయ్యతో తమన్ పని చేస్తున్నాడంటే థియేటర్లలో స్పీకర్లు పగలిపోవడం ఖాయమని అందరూ ఫిక్సవుతుంటారు.
డాకు మహారాజ్ తర్వాత అయితే బాలయ్య ఫ్యాన్స్ తమన్ కు నెక్ట్స్ లెవెల్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఇంటిపేరుని నందమూరి గా మార్చి నందమూరి తమన్ ను చేసేశారు. బాలయ్య కూడా తమన్ ను నందమూరి తమన్ అని స్వయంగా సంబోధించాడు. ఇప్పుడు అదే మాటను బాలయ్య సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu Naidu) భార్య నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) అనడం నెట్టింట వైరలవుతోంది.
ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఆధ్వర్యంలో విజయవాడలో ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ భువనేశ్వరి వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఆమె తమన్ గురించి మాట్లాడుతూ ఇలా ఓ కార్యక్రమం చేద్దామనుకున్నప్పుడు తమన్ పేరే గుర్తొచ్చిందని, వెంటనే సారీ తమన్ కాదు, నందమూరి తమన్(Nandamuri Thaman) అనడంతో అక్కడంతా ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆమె అలా అన్నప్పుడు తమన్ సైతం సిగ్గుపడుతూ నవ్వుకుంటూ మురిసిపోయాడు.













