‘నన్ను దోచుకుందువటే’ టీజర్ విడుదల
సుధీర్‌బాబు, ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. కన్నడ నటి నభా నతీష్ కథానాయిక. సుధీర్‌బాబు ప్రొడక్షన్‌పై ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం చిత్రం బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో సుధీర్‌బాబు ఓ కంపెనీ మేనేజర్‌గా కార్తీక్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయనంటే ఆఫీస్‌లోని వారందరికీ టెర్రర్. కార్తీక్ వస్తున్నాడంటే చాలు అందరూ భయంతో వణికిపోతున్నారు. ఇక ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ సిరి’ అంటూ కథానాయిక తనని తాను పరిచయం చేసుకునే సన్నివేశాలు సరదా సరదాగా నవ్వులు పంచుతున్నాయి. మరి ఆఫీస్‌లో చాలా స్ట్రిక్ట్ అయిన కార్తీక్ జీవితంలోకి సిరి ఎలా వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ‘సిరి నాకు ముందు నుంచే తెలుసా?’ అని సుధీర్‌బాబు వేణును అడిగితే ‘మీరే కదా సర్ సిరిమ్మతో రోజూ మాట్లాడతారు’ అని వేణు చెప్పడం. ‘ఒరేయ్! ఇడియట్ అది ఐఫోన్లో ఉండే సిరిరా’ అని సుధీర్ మండిపడటం నవ్వులు పంచుతోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీకి సురేష్ రగుటు ఛాయాగ్రహణం అందించాడు.













