“నన్ను దోచుకుందువటే” ఫస్ట్‌లుక్ విడుదల
సుధీర్ ప్రొడక్షన్ పేరుతొ కొత్త నిర్మాణ సంస్థను సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా రూపొందిస్తున్న చిత్రంలో ఆయనే హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో హీరోయిన్ నభా నటేష్ టేబుల్‌పై కూర్చుని వయ్యారంగా సెల్ఫీ తీసుకుంటుంటే..పక్కనే ఉన్న సుధీర్ ఆమెను వెటకారంగా చూస్తుండడం ఆకట్టుకుంటోంది. ఆర్ఎస్ నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అజనీష్ బాణీలు సమకూరుస్తున్నారు. నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు.













