అవకాశముంటే ఎల్లమ్మను మిస్ చేసుకోను: నాని
ఏ అంచనాలు లేకుండా రిలీజైన బలగం సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తీసిన ఈ సినిమాకు తెలంగాణ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో వేణు నుంచి రెండో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వేణు రెండో సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఎల్లమ్మ పేరుతో వేణు రెడీ చేసుకున్న కథ నాని కోసం రెడీగా ఉన్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇదేవిషయాన్ని హాయ్ నాన్న ప్రమోషన్స్ లో నాని ని అడగ్గా, దీనిపై నాని ఓపెనయ్యాడు. బలగం సినిమా చూశాక ఒక డైమండ్ ని ఇంత కాలం మిస్ చేసుకున్న ఫీలింగ్ వచ్చిందని, ఎల్లమ్మ కథ ఇంకా వినలేదని, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మిస్ చేసుకోనని క్లారిటీ ఇచ్చాడు.
దిల్ రాజు చెప్తున్న ప్రకారం, ఈ సినిమా మాస్, ఎమోషన్స్ కు ప్రాధాన్యమిచ్చే చిత్రమని, వేణు ఈ కథను ఎంతో కేర్ తీసుకుని డెవలప్ చేశాడని అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నాని ఈ సినిమాను మిస్ చేసుకోడనే అనిపిస్తుంది. ఇప్పటికే వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమాను అనౌన్స్ చేసిన నాని, అది పూర్వగానే శిబి చక్రవర్తితో సెట్స్ మీదకు వెళ్లనున్నాడు. ఎల్లమ్మ స్టోరీ ఓకే అనుకుంటే ఆ తర్వాత ఈ సినిమా ఉండే అవకాశముంది.













