ప్రీపోన్ కానున్న హాయ్ నాన్న?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే సలార్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చిందో వెంటనే మిగిలిన సినిమాల నిర్మాతలు అలెర్ట్ అయ్యారు. సినిమాలు క్లాష్ కాకుండా గ్యాప్ ఉండేలా తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలా అని లెక్కలేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాను ప్రీపోన్ చేయాలని చూస్తున్నారట నిర్మాతలు. డిసెంబర్ 7న హాయ్ నాన్నను రిలీజ్ చేయాలని మేకర్స్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. అదే రోజు ఆపరేషన్ వేలంటైన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నప్పటికీ అన్ని సినిమాలు సంబంధం లేని జోనర్స్ కావడంతో సినిమాను అదే రోజున రిలీజ్ చేయలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఒకవేళ ఇదే డేట్ కు హాయ్ నాన్న రిలీజ్ అయితే సలార్ కు, హాయ్ నాన్న కు మధ్య రెండు వారాలే గ్యాప్ ఉంటుంది. సలార్ వచ్చాక అన్ని థియేటర్లు దానికే వెళ్తాయి. నాని మూవీకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే సలార్ ను కాదని ఈ సినిమాను థియేటర్లు నడపవు.
మరి ఇలాంటి సిట్యుయేషన్స్ లో హాయ్ నాన్న టీమ్ ఎందుకు రిస్క్ చేస్తుందో అనుకుంటే డిసెంబర్ కాకపోతే ఈ సినిమా కోసం మళ్లీ చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ లేట్ చేయదలచుకోలేదు. నాని దసరా సినిమా ఎలాగూ పది రోజుల్లోనే ప్రాఫిట్స్ తెచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.













