హాయ్ నాన్న ఇంకా తేల్చట్లేదేంటి?
అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సలార్ ఇప్పటికే రిలీజ్ అయి ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడి క్రిస్మస్ కు వస్తుంది. దీంతో క్రిస్మస్ కు షెడ్యూల్ అయిన హాయ్ నాన్న, సైంధవ్, ఎక్స్ట్రా సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. వీటిలో హాయ్ నాన్న తప్పించి మిగిలిన రెండు సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ ను కూడా అనౌన్స్ చేశాయి.
సైంధవ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా, ఎక్స్ట్రా మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నాని హాయ్ నాని సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయం తేలాల్సి ఉంది. హాయ్ నాన్న ను డిసెంబర్ 8కు రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడదే వారంలో మరిన్ని సినిమాలు రానుండగా ఈ సినిమాకు పోటీ ఎక్కువైపోయింది.
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఆ వారంలోనే రాబోతున్నాయి. నితిన్ ఎక్స్ట్రా ఇప్పటికే డేట్ ను ఫిక్స్ చేసుకుని రేస్ లోకి వచ్చింది. దీంతో హాయ్ నాన్న ఆ వారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇన్ని పరిస్థితుల్లో హాయ్ నాన్న సినిమా కొత్త రిలీజ్ డేట్ గా ఏ రోజును ఫిక్స్ చేస్తారో చూడాలి.













