రిలీజ్ డేట్ కోసం నాని తిప్పలు
దసరా తర్వాత నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా హాయ్ నాన్న. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే హాయ్ నాన్న మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను మొదట్లో డిసెంబర్ 22న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ డేట్ కు సలార్ వస్తుండటంతో సలార్ కు పోటీగా హాయ్ నాన్న ను రిలీజ్ చేయలేరు కాబట్టి కొత్త రిలీజ్ డేట్ వెతుక్కోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. డిసెంబర్ 1న సినిమాను రిలీజ్ చేద్దామంటే ఆ రోజున యానిమల్ రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. తర్వాత వారం రిలీజ్ చేద్దామా అంటే ఆపరేషన్ వేలంటైన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షెడ్యూల్ అయి ఉన్నాయి.
ఆ తర్వాత వారం అంటే డిసెంబర్ 15కి కెప్టెన్ మిల్లర్ రాబోతుంది. ధనుష్ తో పోటీ పడటం కష్టమైనప్పటికీ ఆ డేట్ అయితేనే బెస్ట్ అనుకుంటున్నారట మేకర్స్. కానీ వారం రోజుల్లో సలార్ రాబోతుంది అన్న విషయం కూడా మేకర్స్ దృష్టిలో పెట్టుకుని రిలీజ్ డేట్ పై ఆఖరి నిర్ణయం తీసుకుంటే బెటర్. ఈ సినిమా రిలీజ్ డేట్ పై నిర్మాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.













