నా 50వ సినిమా మీరే చేయాలి : నాని
హీరో నాని తన 50వ చిత్రానికి దర్శకుడిని డిసైడ్ చేసేశాడు. ఆ దర్శకుడే తన గోల్డెన్ జూబ్లీ మూవీ చేయాలని ఆశించాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. నానిని హీరోగా వెండి తెరకు పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటే. దర్శకుడిగా ఆయనకు ఇది 25వ చిత్రం. నాని 50కి సినిమా ఒకటే కావాలని ఈ హీరో ఆకాంక్షించారు. శుక్రవారం మోహన్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని మోహన్ సర్.. నా 50వ సినిమా మీరే చేయాలి. మీ 25వ చిత్రం నేనే చేయాలి అని పేర్కొంటూ ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో అష్టాచమ్మా, జెంటిల్మెన్ రూపొందాయి. తాజాగా వి. తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సుధీర్‌బాబు పోలీస్‌గా కీలకమైన పాత్ర చేస్తున్నారు. నివేదా థామస్, ఆదితి రావ్ హైదరి హీరోయిన్లు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.













