ఇక నుంచి నాని లో కొత్త నటుడిని చూస్తారట..
అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని తన సహజ నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ తర్వాత అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిమెన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసిఎ, జెర్సీ సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా చేతినిండా సినిమాలతో బిజీ హీరో అయ్యాడు.
నేచురల్ స్టార్ గా ఇప్పటికే జనాల గుర్తింపు దక్కించుకున్న నాని, ఇప్పుడు కమర్సియాలిటీ వైపు నడుస్తున్నాడు. టక్ జగదీష్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఈ సినిమా తర్వాత నుంచి నాని చేయబోయే సినిమాలతో తన లోని పూర్తి స్థాయి నటుడిని బయటకు తీసుకురానున్నాడట నాని.
ప్రస్తుతం నాని శ్యామ సింగ్ రాయ్, అంటే.. సుందరానికీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు చూస్తుంటే తనలోని నటుడిని పూర్తిగా బయటకు తీయడానికి ట్రై చేస్తున్నట్లనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో పెర్ఫామెన్స్ పరంగా కొత్తగా ట్రై చేసిన హీరోల్ని తెలుగు ఆడియన్స్ ఎక్కువగా రిజెక్ట్ చేసిన సందర్భాలే ఉన్నాయి. ఏదైనా సరే ప్రయోగాలు మంచిదే కానీ అది అతి అయితేనే బెడసి కొడుతుంది. ఇప్పుడు నాని చేస్తున్న రెండు సినిమాలూ విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నవే. నాని మార్కెట్ కు మించి ఖర్చు కూడా పెడుతున్నారు నిర్మాతలు. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తాయో చూడాలి.













