Nani: ఆ డైరెక్టర్లతో నాని వరుస సినిమాలు
వరుస హిట్లతో తన క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్న నేచురల్ స్టార్ నాని(Nani) కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాని ఇప్పుడు తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్(The Paradise) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాని.
శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా అందరికీ ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్ వీడియోతో అంచనాలను పెంచేశారు ప్యారడైజ్ మేకర్స్. దాంతో పాటూ నాని, శ్రీకాంత్ కలయికలో వచ్చిన దసరా(Dasara) సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న రెండో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.
కాగా ది ప్యారడైజ్ సినిమా తర్వాత నాని తనకు సూపర్ హిట్ ను అందించిన హాయ్ నాన్న(Hi Nanna) మూవీ డైరెక్టర్ శౌర్యువ్(Shouryuv) తో చేతులు కలపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా అయ్యాయని అంటున్నారు. వాస్తవానికి ది ప్యారడైజ్(The Paradise) తర్వాత నాని, సుజీత్(Sujeeth) తో సినిమా చేయాల్సింది కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అయిందని సమాచారం. మొత్తానికి నాని తనకు సూపర్ హిట్లు అందించిన డైరెక్టర్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈసారి ఆ ఇద్దరు నానికి ఎలాంటి సినిమాలను ఇస్తారో చూడాలి.







