Paradise: ప్యారడైజ్ను అలా ప్లాన్ చేస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్3(Hit3) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే దసరా(Dasara) సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. శ్రీకాంత్ కు దసరా మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో అనుభవమున్న డైరెక్టర్గా దాన్ని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు.
ఆ నమ్మకంతోనే నాని తనకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ప్యారడైజ్(Paradise) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా కోసం నాని శ్రీకాంత్ కు మరింత ఫ్రీడమ్ ఇస్తున్నాడని టాక్. స్క్రిప్ట్ దశ నుంచే సినిమా అద్భుతంగా వచ్చేలా శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ప్యారడైజ్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ప్రస్తుతం హిట్3 చేస్తున్న నాని ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే శ్రీకాంత్ ఓదెలతో తీయబోయే ప్యారడైజ్ కు బల్క్ లో డేట్స్ ఇచ్చేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ ఏడాది సెకండాఫ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనేది నాని ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమాతో కూడా శ్రీకాంత్ బ్లాక్ బస్టర్ అందుకుంటే అతను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరడం ఖాయం.













